Saturday, May 23, 2026
Homeమెదక్‌Edupayala Durgamma | ఏడుపాయలకు మళ్లీ వరద…

Edupayala Durgamma | ఏడుపాయలకు మళ్లీ వరద…

  • రాజగోపురంలో దుర్గామాతకు పూజలు

మెదక్ జిల్లాలోని ఏడుపాయలకు మళ్లీ వరద తాకిడి పెరిగింది. సింగూరు ప్రాజెక్టు నుంచి 12,000 క్యూసెక్కుల నీరు వదలడంతో ఏడుపాయల వనదుర్గా మాత దేవస్థానం ముందు నుంచి మంజీరా ప్రవాహం పెరిగింది. దీంతో దేవస్థానం అధికారులు రాజగోపురంలో వనదుర్గా మాత ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజలు నిర్వహిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. భక్తులు రాజగోపురంలోనే దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు. ప్రధాన దేవాలయానికి వెళ్లేదారిని ఆలయ సిబ్బంది, స్థానిక పోలీసులు మూసివేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News