Wednesday, February 11, 2026
Homeమహబూబ్‌నగర్‌Eradication | డ్ర*గ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తుంది.

Eradication | డ్ర*గ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తుంది.

  • జిల్లా ఎస్పీ రావుల గిరిధర్..
  • డ్ర*గ్స్ రహిత జిల్లా కోసం పోలీసుల ప్రతిజ్ఞ.

డ్ర*గ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో “నాషా ముక్తాభారత్ అభి యాన్”ఐదేళ్లు పూర్తి అయిన సందర్భంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా జిల్లాఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది సా మూహిక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డ్ర*గ్స్ యువతను, కుటుంబాలను, భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకర విషమని వర్ణించారు.

పోలీస్ శాఖ కేవలం చట్టపరమైన చర్యలకే పరిమితం కాకుండా ప్రజల్లో డ్ర*గ్స్ పై అవగాహన కల్పిస్తూ వనపర్తి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా నిలపాలని పోలీసు అధికారులకు సూచించారు. డ్ర*గ్స్ బారిన పడిన, రవాణా చేస్తున్న, అమ్మిన,అట్టి వ్యక్తులపై కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డిసిఆర్బి డిఎస్పీ బాలాజీ నాయక్, వనపర్తి సీఐ కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సిఐ నరేష్, రిజర్వు ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, జిల్లా పోలీస్ కార్యాలయం సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News