Homeనల్లగొండDrone | యాదగిరికొండపై డ్రోన్ ఎగరవేసిన వ్యక్తిపై కేసు నమోదు

Drone | యాదగిరికొండపై డ్రోన్ ఎగరవేసిన వ్యక్తిపై కేసు నమోదు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై డ్రోన్ ఎగరవేసిన వ్యక్తిని గుర్తించి పట్టణ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు దేవస్థానం అధికారులు.ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకట్రావు మాట్లాడుతూ దేవస్థానం కొండప్రాంతం నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణించబడుతుందని తెలిపారు.

Drone Violation at Yadagirigutta Temple Hill1

కొండపై మరియు పరిసర ప్రాంతాలలో డ్రోన్లను ఎగురవేయడం మరియు డ్రోన్ల ద్వారా షూటింగ్ చేయడం కఠినంగా నిషేధించబడినదని,నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. దేవస్థానం భద్రత మరియు ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఆదేశాలను పాటించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్పీఎఫ్ సిఐ శేషగిరిరావు,ఎస్సై రవి,ఏఎస్ఐ కనకయ్య, హోంగార్డ్స్ భాస్కర్,శ్రీశైలం, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News