Homeఆదిలాబాద్Collector | రైతులు కూరగాయల పంటల సాగు విస్తీర్ణం పెంచాలి

Collector | రైతులు కూరగాయల పంటల సాగు విస్తీర్ణం పెంచాలి

  • జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

రైతులు జిల్లాలో కూరగాయల పంటల సాగు విస్తీర్ణం పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, కలెక్టరేట్లోని తన చాంబర్లో సోమవారం పలువురు రైతులకు, ఉచిత ఐదు రకాల కూరగాయల విత్తనాలు గల కిట్ లను అందించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రైతులు కూరగాయల సాగును పెంచేలా కృషి చేయాలని అన్నారు.

District Collector Distributes Vegetable Seed Kits To Farmers

ఐదు రకాల కూరగాయల విత్తనాలు గల కిట్ ల ద్వారా రైతులకు మేలు కలుగుతుందని అన్నారు. ఈ విత్తనాల ద్వారా నాణ్యమైన కూరగాయలు ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు. రైతులందరూ ఈ విత్తనాలను సాగు చేసేలా దృష్టి సారించాలని సూచించారు. ఉద్యానవన పంటల అధికారుల మండలాలలో ఈ విత్తనాల కిట్లు పంపిణీ చేయబడతాయని వివరించారు. ఈ విత్తనాలు అర ఎకరంలో సాగు చేయడానికి సరిపోతాయని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన పంటల అధికారి రమణ, ఇతర అధికారులు, సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News