Homeఆదిలాబాద్Collector | పట్టణ వాసులకు మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించాలి

Collector | పట్టణ వాసులకు మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించాలి

  • జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

పట్టణ వాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం నిర్మల్ పట్టణంలోని బుధవార్ పెట్ 38 వ వార్డులో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్, పలు వీధుల గుండా తిరుగుతూ, రోజువారీగా సాగుతున్న పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి వసతి, తదితర సౌకర్యాలు ఎలా ఉన్నాయో స్వయంగా పరిశీలించారు.

Collector Abhilasha Abhinav Inspects Budhawarpet Ward Infrastructure

స్థానికులతో మాట్లాడుతూ, వారికి రోజు తాగునీరు అందుతుందో లేదో, పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారో లేదో వారిని అడిగి తెలుసుకున్నారు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అని అడిగారు. ఇండ్లలో తడి, పొడి చెత్తలను వేరువేరుగా సేకరించి, చెత్త వాహనాలకు అందివ్వాలని పేర్కొన్నారు. చెత్తను బయట పారివేయరాదని సూచించారు. ఎవరికైనా సమస్యలు కలిగితే వెంటనే అధికారుల, కౌన్సిలర్ దృష్టికి తీసుకురావాలని అన్నారు.

- Advertisement -
Collector Abhilasha Abhinav Inspects Budhawarpet Ward Infrastructure1

అధికారులతో మాట్లాడుతూ, ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మెరుగైన మౌళిక వసతులను కల్పించాలని తెలిపారు. ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లు దృష్టికి వస్తే వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. వేసవికాలం ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతిరోజు తప్పనిసరిగా చెత్త వాహనాలను అన్ని వీధులలోకి తీసుకురావాలని వివరించారు. ప్రతిరోజు సమయానికి త్రాగునీరు సరఫరా చేయాలని తెలిపారు.

Collector Abhilasha Abhinav Inspects Budhawarpet Ward Infrastructure2

అవసరమైన చోట డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మిస్తూ, అవసరమైన వాటికి మరమ్మతులు చేయాలని చెప్పారు. డ్రైనేజీలలో తీసిన పూడికల చెత్తను ఎప్పటికప్పుడు తీసివేయాలని తెలిపారు. ఈ వార్డు పర్యటనలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, తహసిల్దార్ రాజు, వార్డు కౌన్సిలర్ నాందేడపు అన్నపూర్ణ, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Collector Abhilasha Abhinav Inspects Budhawarpet Ward Infrastructure4
- Advertisement -
RELATED ARTICLES

Latest News