Tuesday, November 11, 2025
ePaper
Homeఖమ్మంWelfare | అడుగు తడబడకుండా చిన్న పాదాలకు పెద్ద అండ

Welfare | అడుగు తడబడకుండా చిన్న పాదాలకు పెద్ద అండ

  • పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకి బూట్ల పంపిణీ

పల్లె బాలల అడుగు తడబడకుండా,ముళ్లు,రాళ్లు గుచ్చుకోకుండా చదువు దారిలో ముందుకు సాగాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకి బూట్లు పంపిణీ చేస్తున్నారని మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బూట్ల పంపిణీ చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారుల చదువు ప్రయాణానికి అండగా నిలిచేందుకు పిఎస్ఆర్ ట్రస్ట్ సేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్ నాయక్,సురేష్ నాయక్,వెంపటి రవి,తమ్మినేని నవీన్, ఏటుకూరి సుధాకర్,అంబటి సుబ్బారావు,కందుకూరి వెంకట నారాయణ,మెండె వెంకటేష్ యాదవ్,గౌస్,వెంకట రమణ, శ్రీదేవి,దివ్య,బోయిన సంగయ్య,వెంపటి సురేష్,శేఖర్ రెడ్డి, వెంపటి వెంకన్న,శేషు రెడ్డి,సురేష్ రెడ్డి,విజయలక్ష్మి,రాజు, వెంకటేష్,బోయిన సాయి,పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది,తదితరులు

RELATED ARTICLES
- Advertisment -

Latest News