HomeరాజకీయంAITUC | ఏఐటియుసి 106వ ఆవిర్భావ దినోత్సవం

AITUC | ఏఐటియుసి 106వ ఆవిర్భావ దినోత్సవం

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో అలుపెరుగని పోరాటాలు కొనసాగించి సమస్యల పరిష్కారం కోసం కృషిచేసిన ఘనత ఏఐటియుసికే దక్కుతుందని సిపిఐ రాష్ట్ర నాయకులు ఆందోజు రవీంద్ర చారి అన్నారు. ఏఐటియుసి 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అజ్మీర్ హరి సింగ్ నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర నాయకులు అందోజు రవీంద్ర చారి, సిపిఐ రాష్ట్ర నాయకులు ముత్యాల యాదిరెడ్డిలు విచ్చేసి ఏఐటియుసి జెండాను అవిష్కరించారు.

AITUC 106th Foundation Day celebrated says Andoju Ravindra Chary 2 1

ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు, కార్మికులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నినదించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అందోజు రవీంద్ర చారి, ముత్యాల యాదిరెడ్డిలు మాట్లాడుతూ 106వ ఏట ప్రవేశించిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ (ఏఐటీయూసీ) చరిత్ర అంతా పోరాటాల మయమేనని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి, 4 లేబర్ కోడులను రద్దుచేసి, 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి. కనీస వేతనం రూ.26,000 నిర్ణయించి అమలు చేయాలి. అసంఘటిత కార్మికులకు సమగ్ర సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి.

- Advertisement -
AITUC 106th Foundation Day celebrated says Andoju Ravindra Chary 1

ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక రైతు అసంఘటిత కార్మికులకు సమగ్ర సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి కార్మికులు సుదీర్ఘకాలం పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను అడుగడుగునా కాలరాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, లాభసాటిగా నడు స్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండే కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టారని దుయ్యబట్టారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికుల హక్కుల సాధన కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల మన దేశాన్ని పాలిస్తున్న తరుణంలోనే భారతదేశంలో మొట్టమొదటి యూనియన్ ప్రారంభించే నాటి నుండి నేటి వరకు పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. 1929లో కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని తీర్మానం చేయకముందు అశ్రత్ మొహాని మొదటిసారి ఆ మాట అనకముందు సంపూర్ణ స్వరాజ్యం కావాలని నినదించింది ఏబటియుసి ఏనని వారన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు కేతరాజు రాజు నరసింహ, బి ఓ సి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి ప్రసాద్,

- Advertisement -
RELATED ARTICLES

Latest News