సైబర్ నేరాలు రూపాంతరం చెంది ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో దోపిడీ పీకు స్థాయికి చేరాయి. ఎంతగా అంటే? ఉన్నత విద్యావంతులు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, చివరికి బ్యాంకు అధికారులు సైతం వారి వలలో పడి డబ్బులు కోల్పోయివిలవిలాడుతున్నారు. నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, మానసికంగా బెదిరిస్తూ బురిడీ కొడుతున్నారు. ఈ విధంగా డిజిటల్ అరెస్టుల ఘటనలు నానాటికి పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ నేరాలపై ప్రజాచైతన్యం, అవగాహన పెరగాలి. పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్స్లో అరెస్టులు చేయరని, డబ్బులు బదిలీ చేయమని బెదిరించరని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలి.అప్రమత్తతే ప్రజా ఆయుధం.
- మేదాజీ
