హీరో కిరణ్ అబ్బవరం వరుస విజయాల తర్వాత మరో విభిన్నమైన ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘క’, ‘కె-రాంప్’ చిత్రాల విజయాల తర్వాత ఆయన తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకం రియాలిటీ'(Reality) తో అలరించనున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు కూడా కిరణ్ అబ్బవరం స్వయంగా చేపట్టడంతో పాటు హీరోగా నటిస్తున్నారు. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తుండగా, సురేష్ యెర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ నటిస్తున్న దేవికా భట్‌ను ‘ఆలోచన’ గా పరిచయం చేస్తూ మేకర్స్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో దేవికా భట్ అందంగా, సహజమైన చిరునవ్వుతో ఆకట్టుకుంటున్నారు. హీరోతో ఆమె పంచుకుంటున్న ఆత్మీయమైన క్షణాలు, ఇద్దరి మధ్య కనిపిస్తున్న అనుబంధం పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. విశ్వాస్ డేనియల్ డీవోపీ, సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, సంతోష్ నాయుడు ఎడిటర్‌గా, రాజేష్ కామర్సు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
‘రియాలిటీ'(Reality) క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25, 2026న థియేటర్లలో విడుదల కానుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
తారాగణం: కిరణ్ అబ్బవరం, దేవికా భట్, శరత్ కుమార్, సాయి కుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుదర్శన్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కిరణ్ అబ్బవరం
నిర్మాత: సుధాకర్ చాగంటి
బ్యానర్: జాయ్ ఫిల్మ్స్
సహ నిర్మాత: సురేష్ యర్రా
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
DOP: విశ్వాస్ డేనియల్
ప్రొడక్షన్ డిజైనర్: సుధీర్ మాచర్ల
ఎడిటర్: సంతోష్ నాయుడు
కాస్ట్యూమ్ డిజైనర్: రాజేష్ కామర్సు
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ & ట్రెండ్స్
