మొంథా తుఫాన్ నేపథ్యంలో తిరుమలాయపాలెం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు మందడి ఇజ్రాయెల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొంథా తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులగా కురుస్తున్న అకాల వర్షాలకి రైతులు వ్యవసాయ బావులు,మోటార్ల,విద్యుత్ స్తంభాలు వైపు వెళ్లవద్దని తెలిపారు.వర్షాలకు శిథిల భవనాలు,చెట్ల కింద నిలబడవద్ధన్నారు.
పాఠశాలలకి సెలవులు ప్రకటించినందున తమ పిల్లలని బయటకి పంపవద్దని తల్లితండ్రులకి సూచించారు.వాగులు,కాలువలు,చెరువుల వెంబండి ప్రయాణించవద్దని,వీలైతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు.రహదారుల వెంట వెళ్ళేప్పుడు మ్యాన్ హోల్స్ ను గమనించాలని తెలియజేశారు.ప్రకృతి విలయ తాండవానికి చేతికొచ్చిన పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఇజ్రాయేల్ వెల్లడించారు.
