Wednesday, April 22, 2026
Homeకెరీర్ న్యూస్Jobs | కోల్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు..

Jobs | కోల్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు..

  • 10వ తరగతి వుత్తేర్ణులైతే చాలు..

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అయినా కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పారామెడికల్‌ అండ్‌ ఓవర్సీర్‌, హెచ్‌ఈఎంఎం ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 577 హెచ్‌ఈఈఎంఎం ఆపరేటర్ (ట్రైనీ), పారామెడికల్ స్టాఫ్, ఓవర్సీర్ (సివిల్) ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

పోస్టుల వివరాలు ఇలా
హెచ్‌ఈఈఎంఎం ఆపరేటర్ ట్రైనీ (డంపర్, డోజర్, గ్రేడర్ క్రేన్‌, పేలోడర్‌, సర్ఫేస్‌ మైనర్‌ విభాగాల్లో) పోస్టుల సంఖ్య: 472
పారామెడికల్ స్టాఫ్ (స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, టెక్నీషియన్లు, ఫిజియోథెరపిస్ట్‌) పోస్టుల సంఖ్య: 75
ఓవర్సీర్ సివిల్ పోస్టుల సంఖ్య: 30

- Advertisement -

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి హెచ్‌ఈఈఎంఎం ఆపరేటర్‌కు 10వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు చెల్లుబాటు అయ్యే హెచ్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇక పారామెడికల్‌కు పోస్టులకు ఇంటర్మీడియట్‌తోపాటు సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగి ఉండాలి లేదా నర్సింగ్, ఫార్మసీ, పాథాలజీ తదితర విభాగాల్లో డిగ్రీ కలిగి ఉండాలి. ఓవర్సీర్‌కు సివిల్ ఇంజినీరింగ్‌ పోస్టులకు 3 ఏళ్ల డిప్లొమా తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News