HomeతెలంగాణRevanth Reddy | పంచాయితీపై ఫోకస్

Revanth Reddy | పంచాయితీపై ఫోకస్

  • ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ జిల్లాల పర్యటన..
  • డిసెంబర్ 1 మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నుంచి ప్రారంభం..

పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో సీఎం మరోమారు జిల్లాల్లో పర్యటించి పార్టీ అభ్యర్థలను గెలిపించేందుకు ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్‌ సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మొత్తం ఆరు రోజుల పాటు సీఎం జిల్లాల టూర్‌ కొనసాగనుంది. ఆరు రోజులు ఆరు జిల్లాల్లో సీఎం రేవంత్‌ పర్యటించనున్నారు. సీఎం రేవంత్‌ పర్యటన షెడ్యూల్‌ ఇలావుంటి.

డిసెంబర్‌ 1న మహబూబ్‌ నగర్‌ జిల్లా మక్తల్‌, 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెం, 3న కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌, 4న ఆదిలాబాద్‌, 5న నర్సంపేట, 6న నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించనున్నారు. తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. మొదటి విడత వచ్చే నెల డిసెంబర్‌ 11, రెండో విడత డిసెంబర్‌ 14, మూడో విడత డిసెంబర్‌ 17న ఉంటుంది. అయితే, ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారని తెలుస్తోంది. తాజాగా, సీఎం రేవంత్‌ జిల్లాల పర్యటన ప్రకటనతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో మరింత జోష్‌ నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News