ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్(ICRTF) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరుగుతున్న ఫెలోస్ ఇండియా సదస్సు(Fellows India Conference 2026)లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. గుండె సంబంధ వ్యాధుల నివారణకు అందరం కలిసి మిషన్‌లా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్డియాలజిస్టులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విద్యార్థులకు సీపీఆర్(Cardiopulmonary Resuscitation-cpr) చేయడంలో శిక్షణ ఇవ్వగలిగితే దేశంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడగలుగుతామని సూచించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, దక్షిణాసియా దేశాల నుంచి దాదాపు 500 మంది కార్డియాలజిస్టులు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో పాల్గొన్నారు.
Revanth | ఫెలోస్ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article

