మెగాస్టార్ (Mega Star) చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ (Cyber Crime) పోలీసులను ఆశ్రయించారు. AI సాయంతో తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా డీప్ ఫేక్ (Deep Fake) వీడియోలు (Videos), ఫొటోలు (Photos) రూపొందిస్తున్నారని ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు (Action) తీసుకోవాలని ఇప్పటికే కోర్టు(Court)ను ఆశ్రయించిన చిరంజీవి హైదరాబాద్ సీపీ సజ్జనార్(Sajjanar)కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే.. తనపై మళ్లీ సోషల్ మీడియా(Social Media)లో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని చిరంజీవి పోలీసులకు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ (X) ఖాతాను జోడించారు. ఫిర్యాదు చేసినా ఇంకా ఇలాంటి పోస్టులు (Posts) పెడుతున్నారని, అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Chiranjeevi | మరోసారి పోలీసులకు చిరంజీవి ఫిర్యాదు
RELATED ARTICLES
- Advertisment -
