Tuesday, April 14, 2026
Homeమెదక్‌Village development | గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పనులు చేస్తాం

Village development | గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పనులు చేస్తాం

  • చిలిపిచేడ్ సర్పంచ్ జులా అనిల్ కుమార్
  • గ్రామాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సర్పంచ్

గ్రామాభివృద్ధే ధ్యేయంగా పనులు చేసి తనపై విశ్వాసంతో సర్పంచ్ బాధ్యతలు కట్టబెట్టిన గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చిలిపిచేడ్ గ్రామ సర్పంచ్ జులా అనిల్ కుమార్ తెలిపారు. సోమవారం చిలిపిచేడ్ గ్రామంలో గ్రామ సర్పంచ్ జులా అనిల్ కుమార్ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళ సమాఖ్య భవనం కోసం స్థలం చదును చేయించారు. ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. గ్రామంలో సమస్యలు ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News