వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(Ysrcp) సీనియర్ నేత(Senior Leader) చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీ హైకోర్టు(AP High Court)లో ఉపశమనం లభించింది. ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆయనకు బెయిల్(Bail) మంజూరైంది. చెవిరెడ్డితోపాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడికి కూడా న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనేది ప్రధాన ఆరోపణ. ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) పేర్కొంది. ఈ నేపథ్యంలో 2025 జూన్ 17న సిట్ ఆఫీసర్లు చెవిరెడ్డిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం పలుమార్లు అప్లై చేసుకున్నా రాలేదు. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏ-38గా పేర్కొన్నారు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని ఏ-39గా చేర్చారు.
AP Liquor Scam Case | చెవిరెడ్డి సహా ముగ్గురికి బెయిల్ మంజూరు
- Advertisement -
RELATED ARTICLES
