- సీపీఐ ఘన నివాళులు
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ(Chakali Ailamma) 41వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ ధోబిఘాట్ లోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు(Tributes). కాప్రా మండల సిపిఐ కార్యదర్శి దర్శనం యాదగిరి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కార్యవర్గ సభ్యులు నిమ్మల నరసింహ, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్ దశరథ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.
ఐలమ్మ చిన్నతనం నుంచే అన్యాయాన్ని ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్నారని గుర్తుచేశారు. భూస్వామి కొండలరావు వద్ద కవులుకు తీసుకున్న పొలంలో పండించిన పంటను విస్నూర్ దొర రామచంద్రారెడ్డి ధ్వంసం చేయాలని చూస్తే, “దున్నేవాడిదే భూమి… మధ్యలో మీ పెత్తనమేంటి?” అని కొడవలి పట్టి నిలదీశారని తెలిపారు. దొరల దౌర్జన్యాలు, కుటుంబంపై జరిగిన దాడులు, అన్యాయపు కేసులకు వెరవకుండా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో చేతిలో రోకలిబండ పట్టి నైజాం సైన్యాన్ని, దొరల అరాచకాలను ఎదిరించి వేలాది ఎకరాల భూములను పేదలకు పంచడానికి ఆమె పునాది వేశారన్నారు.(epaper.aadabhyderabad.in)
తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు గ్రామాలు, వీధుల్లో పోరాట వీరుల స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సెప్టెంబర్ 17న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభకు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు అంబాల ఎల్లయ్య, రైతు సంఘం నాయకుడు పి.నరసింహ, మహిళా నాయకులు అనసూయ, డి.మల్లిక, ఆదర్శనగర్ సీపీఐ కార్యదర్శి కిరణ్, చిట్యాల బుచ్ఛమ్మ, ఈ.నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.
