Monday, May 11, 2026
HomeజాతీయంReel Block | విజయ్ రీల్ ను బ్లాక్ చేసిన కేంద్రం..

Reel Block | విజయ్ రీల్ ను బ్లాక్ చేసిన కేంద్రం..

  • కాంగ్రెస్ విమర్శలను తిప్పి కొట్టిన కేంద్రం..

త‌మిళ‌నాడు సీఎంగా విజ‌య్ ఆదివారం ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. ఆ స్టార్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అయితే ఇద్ద‌రికి సంబంధించిన ఓ రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ లో అప్‌లోడ్ చేశారు. కానీ ఆ రీల్‌తో పాటు ఓ ఫోటోను కేంద్రం బ్లాక్ చేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ ఆ పోస్టును అడ్డుకున్న‌ట్లు విమ‌ర్శించారు. అయితే కాంగ్రెస్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను కేంద్రం కొట్టిపారేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తలెత్తిన స‌మ‌స్య‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ తెలిపింది. ఆ ప్లాట్‌ఫామ్‌లో త‌లెత్తిన అంత‌ర్గ‌త స‌మ‌స్య వ‌ల్ల‌.. పోస్టు ఫ్లాగింగ్ బ్లాక్ అయిన‌ట్లు ఆ శాఖ వెల్ల‌డించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News