మా తెలంగాణల(Telangana) సంకురాతిరి పండగంటే.. నడింట్ల పాత దుప్పటి పర్వాలే. నడివిట్ల గౌరమ్మను(Gouramma) పెట్టాలే. సకినాలు(Sakinalu) సుట్టాలే. పదొద్దుల ముందే వాడ వాడంతా వంతులేస్కొని మరీ కంచుడు వెడ్తరు. బజార్ల గిర్నీల సప్పుడు. ఇండ్లల్ల అప్పాల గంపలు నిండుడు. తాత(Grand Father)కు సకినాలు దంగయని.. అమ్మమ్మ(Grand Mother) అరిసెలు(Ariselu) చేసి తనబ్బిల ఓరవెట్టేది. ఇంతల బళ్లకు పండగ సెలవులు(Festival Holidays) రానే అచ్చే. మనుమలత్తరని తాత బస్సుకాడికి పోయి తోల్కతాంటే.. అమ్మమ్మ గల్మల నిలవడి అంగంగి మరీ సూసేది. బోగి(Bhogi) నాడు ఆడబిడ్డలు సీకట్ల లేషి ఆకిట్ల గిర్క వట్టి ముగ్గులేత్తంటే..
బజార్ల పోయే పెద్దబాపు ఎప్పుడచ్చింర్రని మందలిచ్చేది. పిల్లలేమో నూతి కాడ రేగుపండ్లతో బోగితానం చేస్తే.. తాతేమో పెరట్ల గర్కపోసలు, బంతిపూలు తెంపుకచ్చేది. అమ్మమ్మ అర్రలికి దీపం పెట్టి.. కడప కడపకల్ల గొబ్బెమ్మలు పెట్టి.. జొన్నిత్తులు, మక్కిత్తులు చిక్కుడుకాయలు పోసేది. దర్వాజ ముంగల గంగిరెద్దులు ఆటలాడి దండాలు పెడితే.. అమ్మమ్మ చాట్ల వడ్లు తెచ్చి పోసేది. మాపటి పొద్దుకి పెసర గారెలు, పచ్చిపులుసు, పులగన్నంతో కడుపు నిండేది. ఎడ్లకు బొట్టు పెట్టి పొలంల పండిన పంట ఇంటికి చేరితే.. సంకురాతిరి పండగ బంగారు ధాన్యమై మెరిసే. పండగంటే ఊల్లె పాలొల్లతో పామురంగా మాట్లాడుడు. ఉన్నన్ని రోజులు అమ్మనాన్నలను కండ్ల నిండా సూసుకునుడు. బస్సెక్కేటప్పుడు కండ్ల నీళ్లు తీసి సకినాల సంచి చేతికిచ్చి సాగనొంపుడు.
- తుమ్మల కల్పనా రెడ్డి

