- జిల్లా ఇంచార్జ్ బొక్క బాల్ రెడ్డి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని వనపర్తి జిల్లా ఇన్చార్జ్ ఒక్క బాల్ రెడ్డి బిజెపి పార్టీ నాయకులకు సూచించారు. బుధవారం బిజెపి కార్యాలయంలో నూతనంగా వనపర్తి జిల్లా ఇన్చార్జి గా నియమితులై తొలిసారి పట్టణానికి విచ్చేసిన ఆయనకు జిల్లా అధ్యక్షుడు డి నారాయణ సాధారంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ మాట్లాడుతూ.. పార్టీ బలోపితం కోసం నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి విడుదలయ్యే నిధులు 100 శాతం కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని, గ్రామాలలో ఇటువంటి నిధులపై అవగాహన కల్పించి ప్రజలలో చైతన్యం తీసుకురావాలని తెలిపారు.

పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. 6 గ్యారెంటీలు, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయలేక ప్రజల ఉసిరు పోసుకుంటుందని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, ఓబిసి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైలం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మున్నూరు రవీందర్, స్థానిక సంస్థల ఇంచార్జ్ మెంటేపల్లి పురుషోత్తం రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, పెద్దిరాజు, కల్పన, ఉపాధ్యక్షులు బాసెట్టి శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్ సుమిత్రమ్మ, జిల్లా కోశాధికారి కుమారస్వామి, జిల్లా కార్యదర్శి బాలానగర్ సూరి, మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.
