Saturday, February 7, 2026
Homeనల్లగొండAlair | ఆలేరు లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీర్ల ఐలయ్య

Alair | ఆలేరు లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మూడవ రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు.

పట్టణంలోని ప్రతి వార్డులో గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజలను ఆయన అభ్యర్థించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే రానున్న కాలంలో ఆలేరు పట్టణంలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై అవగాహన కల్పించారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆలేరు పట్టణంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News