Thursday, January 22, 2026
EPAPER
Homeకరీంనగర్BCM Trust | పేద ప్రజలకు బి సి ఎం ట్రస్ట్ వరం లాంటిది

BCM Trust | పేద ప్రజలకు బి సి ఎం ట్రస్ట్ వరం లాంటిది

  • రామన్నపేట సర్పంచ్ చింతలపల్లి కవిత వెంకటరెడ్డి

గ్రామీణ పేద ప్రజలకు కొదురుపాక బిసిఎం ట్రస్ట్ వరం లాంటిదని రామన్నపేట సర్పంచ్ చింతలపల్లి కవిత వెంకటరెడ్డి అన్నారు. బుధవారం రాజన్న బోయినపల్లి మండలం కొదురుపాక బీ సీఎం ట్రస్ట్ కంటి దవఖాన వారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సర్పంచ్ చింతలపల్లి కవిత వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ ఉచిత కంటి శిబిరంలో 150 మందికి ఉచిత పరీక్షలు చేసి, మరో కొందరికి కంటి ఆపరేషన్ కు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సర్పంచ్ చింతలపల్లి కవిత వెంకటరెడ్డి మాట్లాడుతూ కొదురుపాక బి సి ఎం కంటి ఆస్పత్రి నిర్వాహకులు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వైరాగ్యం రాజలింగం – రీటా బహుదుర్ షా దంపతులు ఈ మారుమూల ప్రాంతంలో అధునాతన సౌకర్యాలతో కార్పొరేటు కు మించి కంటి దావఖానా ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు

ఇప్పటివరకు ఈ మూడేళ్ల కాలంలో 56 గ్రామాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి పదివేల మందికి పైగా కంటి పరీక్షలు చేశారని చెప్పారు. అంతేకాకుండా 2150 మందికి సెకండ్ టి ఆపరేషన్ చేశారని చెప్పారు. గ్రామీణ పేద ప్రజలకు ఈ కంటి దవాఖాన చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కంటివవైద్య నిపుణురాలు డాక్టర్ వైరాగ్యం రిట బహదూర్ షా, డ్యూటీ డాక్టర్ రాజేంద్రనాథ్, , వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు చింతలపల్లి వెంకటరెడ్డి, మాజి ఉప సర్పంచ్ కవ్వం పల్లి రాములు,మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News