- కారును ఢీకొన్న ట్రక్కు.. ఆరుగురు దుర్మరణం
ఉత్తరప్రదేశ్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకిలోని దేవా- ఫతేపూర్ రహదారిపై ట్రక్కు కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఇద్దరికి గాయాల య్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బారాబంకి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్పిత్ విజయవర్గియ తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది మందితో వెళుతున్న కారును దేవా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ట్రక్కు బలంగా ఢీకొట్టింది. దీంతో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఆరుగురు మృతి చెందారు. మెరుగైన చికిత్స కోసం ఇద్దరినీ వేరే ఆసుపత్రికి తరలించాము. కారు, ట్రక్కు రెండు వాహనాలు వ్యతిరేక దిశలో వస్తున్నాయి. అందువల్లే ఈ ప్రమాదం జరిగింది అని ఆయన అన్నారు.
