Wednesday, March 4, 2026
Homeఆంధ్రప్రదేశ్Rayalaseema | ‘పూర్వోదయ’తో సీమ అభివృద్ధికి ప్రణాళికలు

Rayalaseema | ‘పూర్వోదయ’తో సీమ అభివృద్ధికి ప్రణాళికలు

ఉద్యాన పంటల సాగు, మార్కెటింగ్ కోసం మౌలిక సదుపాయాల కల్పన
రూ.40 వేల కోట్లతో రాయలసీమ రైతుల అభివృద్ధికి కార్యాచరణ
50 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగు లక్ష్యం
ఉద్యాన పంటల అభివృద్ధిపై సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి: ప్రపంచం(World)లో డిమాండ్ (Demand) ఉన్న ఉద్యాన పంటల్లో (horticultural crops) 18 రకాల పంటలు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనే (Prakasham District) పండుతాయని సీఎం చంద్రబాబు (CM Chandra babu) చెప్పారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా ఉద్యాన పంటలు సాగుచేసే రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పూర్వోదయ (Poorvodaya) నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్వోదయ స్కీంలో భాగంగా రాయలసీమ ఉద్యాన పంటల అభివృద్ధిపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం సమీక్షించారు.

- Advertisement -

రాయలసీమ, ప్రకాశం జిల్లాలో 92 క్లస్టర్ల ద్వారా రైతులకు జీవనోపాధి పెంచేలా కార్యాచరణ రూపొందించారు. పూర్వోదయ స్కీమ్‌లో భాగంగా రహదారులు, జల వనరుల ప్రాజెక్టులు, పంచాయతీ రోడ్లు లాంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రూ.40 వేల కోట్లతో ప్రణాళిక అమలుచేయనున్నారు. మొత్తం 5.98 లక్షల ఉద్యాన రైతులకు మరింత లబ్ది కలిగేలా ప్రణాళికపై సమీక్షించారు. అలాగే.. ప్రపంచ బ్యాంకు నిధులతో రాయలసీమ అభివృద్ధికి ఏయే అంశాల్లో దృష్టి సారించాలనే అంశంపై సీఎం చంద్రబాబు చర్చించారు. నీతి ఆయోగ్ సిఫారసులతో ఉమ్మడి రాయలసీమ, ప్రకాశం జిల్లాల పరిధిలోని 9 జిల్లాల్లోని హార్టికల్చర్, రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆర్ అండ్ బీ రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు వంటి అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దటం లక్ష్యంగా పెట్టుకోవాలి. సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. రాయలసీమలో మొత్తం 65 రకాల ఉద్యాన పంటలు పండుతుంటే.. డిమాండ్ డ్రివెన్ హార్టికల్చర్ 18 రకాల పంటలకు మంచి డిమాండ్ ఉంది. ఈ రకాల పంటలను పండించేలా ఉద్యాన రైతులను ప్రొత్సహించాలి. అప్పుడు సీమలో ఉద్యాన పంటల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం సులువుగా ఉంటుంది. దీనికోసం రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. రెగ్యులర్ క్రాప్స్ కన్నా భవిష్యత్తులో ప్రజల అలవాట్లకు అనుగుణంగా పంటలు పండించాల్సి ఉంటుంది.

అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఉత్పత్తి, టేబుల్ వెరైటీలను పండించి ఆ పంటలకు విలువ జోడించాలి. అప్పుడే రైతులకు ఆర్ధిక ప్రయోజనాలు అందుతాయి. మైక్రో ఇరిగేషన్ ద్వారా ఈ ఉద్యాన పంటలకు నీటిని అందించాలి. హార్టికల్చర్ జోన్లుగా తీర్చిదిద్ది ప్రోత్సాహకాలు కల్పించాలి. ఆర్గానిక్ సేద్యం ద్వారా ఉద్యాన పంటలు పండించాలి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉద్యాన పంటలు పండిస్తే అది రైతులకు మేలు కలుగుతుంది. ఆక్వా రంగం తరహాలోనే ఉద్యాన రంగం కూడా భవిష్యత్తులో అగ్ర స్థానానికి చేరుతుంది. ఈ 9 జిల్లాల పరిధిలో ప్రస్తుతం ఉన్న 10 రకాల ఉద్యాన పంటలతోపాటు డిమాండ్ ఉన్న మరో 8 పంటలనూ పండించేలా చర్యలు తీసుకోండి” అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News