- శ్రీహరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- కుప్పం జైలుకు తరలిస్తున్న వైనం..
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సీపీఆర్‌వోగా పనిచేసిన పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు చేతిలో కత్తిపెట్టిన యానిమేషన్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టించారన్న కేసులో శ్రీహరిని చిత్తూరు జిల్లా కుప్పంలో కేసు నమోదైంది.
దీంతో విజయవాడలో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అనంపురం జిల్లా పంపనూర్‌కు చెందిన వైసీపీ సోషల్ మీడియా నాయకుడు గిరిశ్‌కుమార్ రెడ్డిని అరెస్టు చేసి కుప్పంకు తరలిస్తున్నారు.
- Advertisement -
- Advertisement -
