Sunday, June 14, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు

Aaj Ki Baath | అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు

మన రాష్ట్ర అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పులు తెచ్చే దుస్థితికి కారకులు ఎవరు..? ఆనాడు కేసీఆర్ చేసిన అప్పులను ప్రశ్నిస్తే “సంపద సృష్టిస్తాం’ అన్నారు.. నేడు ఏపీలో చంద్రబాబుదీ అదే దోరణి! కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని, అధికారానికి వచ్చి అంతకు మించిన అప్పులు తెస్తున్నారు..? ఉద్యోగులు విధులు నిర్వహించక పోతే పాలన స్తంభిస్తోంది కానీ వారి జీతాలు, బకాయిలకు మాత్రం “ఖజానా ఖాళీ”! అంటూ- ఓటు బ్యాంకు ఉచిత పథకాలకు కొదవ లేదు.. భూములు అమ్మినా, లిక్కర్ ధరలు పెంచినా, పన్నుల మీద పన్నులు వేసినా పాలకులకు నష్టం లేదు..? కానీ ప్రజల నెత్తిన అప్పుల కత్తివేలాడుతోంది పాలకులకు ఆర్థిక క్రమశిక్షణ లేదు! ఉచితాలు వద్దు మీ దుబారా ఖర్చులు వద్దు! అప్పులు చేయడానికే అధికారం ఇవ్వలేదు? వంతుల వారీగా దో(దా)చు కోవడం ఆపాలి.. ఇది పాలకులు సృష్టించిన పెద్ద సంక్షోభం!

  • మేదాజీ..
- Advertisement -
RELATED ARTICLES

Latest News