Wednesday, February 25, 2026
Homeవరంగల్‌Sarpanch | అనంతారం సర్పంచ్ ప్రమాణస్వీకారం

Sarpanch | అనంతారం సర్పంచ్ ప్రమాణస్వీకారం

పర్వతగిరి, డిసెంబర్ 22(ఆదాబ్ హైదరాబాద్): వరంగల్ జిల్లా(Warangal District) పర్వతగిరి మండలం(Parvathagiri Mandal) అనంతారం(Anantharam)లోని గ్రామ పంచాయతీ కార్యాలయం(Gram Panchayat Office)లో సర్పంచ్(Sarpanch), వార్డు సభ్యులు(Ward Members) ప్రమాణ స్వీకారం(Oath Taking) చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి దివ్య సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. సర్పంచ్ తౌటి శ్రీలత, ఉప సర్పంచ్ పెర్వారం రతన్ బాబుతోపాటు ఏడుగురు వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు.. స్థానిక పోచమ్మ తల్లికి సర్పంచ్ తౌటి శ్రీలత, దేవేందర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి తల్లి దీవెనలు పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పలువురు గ్రామస్తులు, వార్డు సభ్యులు మాట్లాడారు.

సర్పంచి శ్రీలత మాట్లాడుతూ గత ఐదేళ్లలో తన భర్త (తాజా మాజీ సర్పంచ్) తౌటి దేవేందర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి రెండోసారి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న చిన్న చిన్న కోపతాపాలను మనసులో పెట్టుకోకుండా గ్రామస్తులంతా కలిసి మెలిసి ఉండాలని కోరారు. నూతన పాలక వర్గానికి గ్రామస్తులు, బంధుమిత్రులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్రామంలోని ప్రజలందరికి మంచి నీరు అందించేందుకు వాటర్ ప్లాంట్ కోసం ప్రథమ తీర్మానం చేసినట్లు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మేకిరి మల్లికార్జున్, మాజీ ఉప సర్పంచ్ మేకిరి భుజంగ రావు, తౌటి రాజు, బండ్లోజు రమణా చారి, కౌడగాని తిరుపతి, అబ్బరబోయిన చిన్న సాంబయ్య, పేర్వారం శ్రీనివాస్, మేకిరి యుగంధర్, పంతంగి దేవేందర్, జేరిపోతుల కార్తీక్, గుంటి సాంబయ్య, యూత్ క్లబ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News