Homeఆదాబ్ ప్రత్యేకంSwargaseema | స్వర్గసీమలో ప్లాట్లు కొంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!

Swargaseema | స్వర్గసీమలో ప్లాట్లు కొంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!

  • షాద్నగర్ వెంచర్ అంటూ ప్రకటనలు.. అమ్మకం మాత్రం మహబూబ్నగర్ జిల్లాలో..
  • పోలీస్ అధికారిలాగా డ్రెస్.. సైరన్ వేసుకొంటూ వాహనాన్ని చూపుతూ శఠగోపం
  • గ్రామ పంచాయతీ మాన్యువల్ లే అవుట్ పర్మిషన్ తో ఘరానా మోసానికి శ్రీకారం..
  • పంచాయతీ రాజ్ చట్టం 2018 నిబంధనలకు దర్జాగా తూట్లు..!
  • జీ.ఓ.ఏం.ఎస్ నెంబర్ 67 రూల్స్ అతిక్రమణ చేస్తున్న చండ్ర చంద్రశేఖర్..
  • రూ.21 లక్ష లకు ప్లాట్లు అంటూ రిజిస్ట్రేషన్లో తక్కువ చూపుతున్న ఘనపాటి..?
  • ఐటీ శాఖ దృష్టి సారిస్తే ఇతగాడి వ్యవహారం బట్టబయలు అయ్యే అవకాశం..
  • లే అవుట్లో వెలిసిన అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని పంచాయతీ కారదర్శులు..
  • అడ్డదారిలో పొందిన ఇరిగేషన్ ఎన్.ఓ.సి.
  • కార్యదర్శులకు భారీగా ముడుపులు ముట్టిన్నట్లు ఆరోపనలు..!
  • జిల్లా పంచాయతీ అధికారి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్..

మహబూబ్​నగర్ జిల్లాలో బాలానగర్ మండలం, తిరుమలాపూర్ గ్రామ శివారులో స్వర్గసీమ పేరుతో ఆకర్షణీయ ప్రకటనలు ఇస్తూ అమాయక ప్రజల నెత్తిన శఠగోపం పెడుతున్న రియల్ ఎస్టేట్ బాగోతం వెలుగులోకి వచ్చింది.. చెప్పేది ఒకచోట అమ్మేది మరోచోట.. షాద్నగర్ పరిసర ప్రాంతాలంటూ ప్రచారం చేసి, వాస్తవానికి మహబూబ్నగర్ జిల్లాలోని భూములను ప్లాట్లుగా విక్రయిస్తున్న వైనం కలకలం రేపుతోంది.. మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న చండ్ర చంద్రశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. విచిత్రమైన వేషాలు, హంగులతో అమాయక కొనుగోలుదారులను మభ్యపెడుతూ ప్లాట్ల విక్రయాలకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

Allegations Surface Over Swargaseema Ameya Real Estate Venture0

గ్రామ పంచాయతీ మ్యానువల్ లే అవుట్ పర్మిషన్ను అడ్డం పెట్టుకుని, కోట్ల రూపాయల విలువైన ఘరానా వ్యవహారానికి తెరలేపినట్లు తెలుస్తోంది.. పంచాయతీ రాజ్ చట్టం 2018 నిబంధనలకు తూట్లు పొడుస్తూ, జి.ఓ.ఎం.ఎస్ నెంబర్ 67 రూల్స్ను తుంగలో తొక్కి దర్జాగా అతిక్రమిస్తూ అక్రమ లే అవుట్ల ను చేస్తున్నాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి..

- Advertisement -
Allegations Surface Over Swargaseema Ameya Real Estate Venture2

లే అవుట్ల లో స్విమ్మింగ్ పూల్ తో పాటు రూముల నిర్మాణం చేపట్టి పంచా యతీ రాజ్ శాఖకు సవాలు విసురుతున్నాడు.. ఇతగాడి మాయ మాటల్లో పడి కొనుగోలు చేసిన కస్టమర్లకు ప్రతి ప్లాట్ను సుమారు 21 లక్షల రూపాయలకు విక్రయిస్తున్నప్పటికీ, రిజిస్ట్రే షన్ సమయంలో చూపిస్తున్న విలువ ఎంత అన్న ప్రశ్నలు ఉత్ప న్నమవుతున్నాయి.. ఈ కోణంలో ఆదాయపు పన్ను శాఖ అధికా రులు దృష్టిసారిస్తే, చండ్ర చంద్రశేఖర్ వ్యవహారాలు బట్టబయలు అయ్యే అవకాశముందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Allegations Surface Over Swargaseema Ameya Real Estate Venture3

లే అవుట్లలో అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు వెలుస్తుండగా, పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. అంతేకాదు, అడ్డదారిలో ఇరిగేషన్ ఎన్ఎసీ పొందినట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. స్వర్గసీమ, సిరుల సీమా, అమోయ పేరుతో అక్రమ వెంచర్లు చేస్తూ అమాయకులను మోసం కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని బహిరంగ విమర్శలు వెలువెత్తుతున్నాయి..

Allegations Surface Over Swargaseema Ameya Real Estate Venture

ఇదిలా ఉండగా, చండ్ర చంద్రశేఖర్ పోలీస్ అధికారిలా డ్రెస్ ధరించి, సైరన్ ఉన్న వాహనాన్ని ఉపయోగిస్తూ ప్రజల్లో భయభ్రాంతులు సృష్టిస్తున్నాడన్న విమర్శలు సైతం వెల్లువెత్తు తున్నాయి.. పోలీస్ శాఖ అధికారులు అనుమతి తీసుకొని డ్రెస్ వేసుకున్నాడా.. ఈ పోలీస్ డ్రెస్ సైరన్ వెకిల్ ఎక్కడి నుండి వచ్చిందన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.. బహి రంగంగానే పోలీస్ యూనిఫామ్ తో పలు చానల్లో, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వడంతో ఇతడు నిజంగానే పోలీస్ అధికారా అనే అనుమానం సైతం వస్తుంది.. అక్రమంగా సంపాదించే కాసుల కోసమే ఈ రూపాన్ని ధరించి ప్రజలను మభ్య పెడుతున్నాడా..? అన్న విషయం ప్రశ్నార్ధకంగా మారింది.

Allegations Surface Over Swargaseema Ameya Real Estate Venture5

అక్రమ లేఅవుట్, అనుమతి లేకుండా నిర్మించిన రూములపై చర్యలు చేపట్టకుండా ప్రేక్షక పాత్రలో పంచాయతీ కార్యదర్శులు ఉండడంతో భారీగా ముడుపులు తీసుకుని ఆ వైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. స్వర్గసీమ, సిరుల సీమ, అమోయ పేరుతో చేస్తున్న ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా పంచాయతీ అధికారి సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు, పలువురు సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు..

Allegations Surface Over Swargaseema Ameya Real Estate Venture4

ఉన్నతాధికారులు చర్యలు చేపట్ట కుండా ఆలస్యం చేస్తే మరికొంతమంది అమాయకులు మోస పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొడుతూ మోసం రూ.21 లక్షకు పైగా ఫ్లాట్లను విక్రయిస్తూ రిజిస్ట్రేషన్ల శాఖకు కుచ్చుటోపి పెడుతు న్నాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.. ఇప్పటికైనా ఇన్కమ్ టాక్స్ అధికారులు ఇతగాడి ఆర్థిక లావాదేవీలపై, ప్రకటనలో చూపిన విధంగా రూ.21 లక్షలకు కస్టమర్ల దగ్గర చూసుకొని తీసుకొని తక్కువ రేట్లో రిజిస్ట్రేషన్లు చేస్తూ ప్రభుత్వానికి టాక్స్ ఎగవేస్తున్నా విషయంపై దృష్టి సారిస్తే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బట్టబయలు అవుతాయి.

స్వర్గసీమ, సిరుల సీమ, అమోయ పేరుతో కొనుగోలు చేసిన కస్టమర్లకు చేసిన రిజిస్ట్రేషన్లో చూపిన విలువలను చెక్ చేస్తే ఈయన బాగోతం వెలుగు చూస్తుందని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తు న్నారు.. ఇప్పటికైనా ఈయన అక్రమాలకు చెక్ పెట్టి, అమా యకులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు..

ఇరిగేషన్ ఎన్ఎసి ఎలా తెచ్చుకున్నాడు.? భూ భారతి రికార్డుల్లో సదరు సర్వే నెంబర్లు ఏం చూపిస్తున్నాయి.? మైనింగ్ అను మతులు తీసుకొని బ్లాస్టింగులు చేశాడా..? సంబంధిత గ్రామ పంచా యతీకి కట్టిన రాయల్టీ ఎంత..? చండ్ర చంద్ర శేఖర్ ప్రజలను ఎలాంటి మోసాలకు గురి చేస్తున్నాడు..? అన్న విషయా లకు సంబంధించి మరో కథనం ద్వారా ఆధారాలతో వెలుగులోకి తేనుంది

“ఆదాబ్ హైదరాబాద్” ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

- Advertisement -
RELATED ARTICLES

Latest News