ప్రజాసేవ పేరిట నడుస్తున్న సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం అవినీతి కేంద్రంగా మారిందనే ఆరోపణలు ఊపందుకున్నాయి. ఒకవైపు ట్యాక్స్ వసూళ్లలో చేతివాటం చూపిస్తూ, మరోవైపు అక్రమ కట్టడాలకు అండగా మారిన అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం, పర్మిషన్ లేకుండా నిర్మించిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడం నేరం.
అయితే సిద్ధిపేట మున్సిపల్లో మాత్రం చట్టం అనే పదం లంచం ముందు మౌనమవుతోంది. ఫైల్ కదలాలంటే లంచం తప్పనిసరి అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదవాడైతే చట్టం గట్టిగా కొడుతుంది, ధనవంతుడు అయితే చట్టం నమస్కరిస్తుంది!” అని ప్రజలు చేదుగా వ్యాఖ్యానిస్తున్నారు. అక్రమ కట్టడాలకు అండ నిజాయితీదారులకు కండ! పర్మిషన్ లేకుండా ఐదు అంతస్తుల భవనాలు కట్టినా అధికారులు కళ్ళు మూస్తున్నారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా, పర్మిషన్ ఉన్న వారినే ఇబ్బందిపెట్టడం కొత్త పద్ధతిగా మారింది. ఇక ట్యాక్స్ హెూల్డర్ పేరిట వసూలు చేస్తూ, దాన్ని చట్టబద్ధతకు సర్టిఫికేట్ గా చూపించడం మున్సిపల్ కొత్త వ్యాపారం అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
ప్రజల కళ్లముందే అవినీతి..!
ప్రమాణాలు పాటించి ఫైల్ వేసుకున్న వారిని నెలల తరబడి వేచించేస్తున్నారు. కానీ లంచం ఇస్తే రాత్రికి రాత్రే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సిద్ధం లేదా ఇంకాస్త ముట్ట చెప్పుకుంటే ఆక్యుఫెన్సీ లేకుంన సరే అంటూ ప్రజలే చెబుతున్నారు. మరి అధికారుల పారదర్శక పాలన ఎక్కడ? పరాధీన పాలన మాత్రమే! ప్రభుత్వం పారదర్శక పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటోంది.
కానీ సిద్దిపేట మున్సిపల్లో మాత్రం అవినీతి సునామీ దూసుకొస్తోంది. ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సిద్దిపేట మున్సిపల్ జరుగుతున్న అవినీతి దందాపై తక్షణ దర్యాప్తు జరిపి, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేస్తున్నారు.
పర్మిషన్ లేకుండా నిర్మాణాలకు కళ్లెం లేదు లంచం లేకుండా ఫైల్ కదలదు ట్యాక్స్ పసూళ్లలో అనుమానాస్పద లావాదేవీలు “చట్టం కాదు చిల్లరే న్యాయం నిర్ణయిస్తోంది”. సిద్దిపేట మున్సిపల్ అవినీతి చీకటిలో మునిగిపోతోంది. ప్రజల నమ్మకం తునాతునకలైపోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అవినీతి కట్టడి చేయకపోతే సిద్ధిపేటలో చట్టం కన్నీళ్లు కార్చాల్సిన పరిస్థితి వస్తుంది.
