- అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్..
అవినీతిపరులను ఓడించి ప్రశ్నించే గొంతుకలను గెలిపించి మునిసిపాలిటీని ప్రక్షాళన చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్ పిలుపునిచ్చారు. 5, 13, 28 వ వార్డులను శనివారం అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతిని అంతం చేయడానికి అనువైన వార్డులలో అఖిలపక ఐక్యవేదిక సభ్యులు పోటీ చేయనన్నట్లు తెలిపారు . ప్రశ్నించే గొంతుకలపై అవినీతిపరులు బెదిరింపులే కాక దాడులకు దిగినా సరే పుట్టిన ఊరికి సేవ చేయాలనే లక్ష్యం ఏ త్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు.

ఎన్నికల షెడ్యూలు విడుదల తర్వాత నామినేషన్ వేసే అభ్యర్థులను బట్టి నిర్ణయాలు తీసుకుంటామని అంతవరకు ప్రజలతో మమేకమై వనపర్తికి ఎవరు కీడు చేశారో ? ఎవరు దోచుకున్నారో ? తగు సాక్షాలతో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, బత్తిని మధు, రామస్వామి, నాగరాజు, రమేష్, జక్కుల రాములు, వెంకటస్వామి, రమేష్ నాయక్, మన్యం నాయక్, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
