Homeబిజినెస్Akshaya Tritiya | కలిసివచ్చిన అక్షయ తృతీయ అమ్మకాలు..

Akshaya Tritiya | కలిసివచ్చిన అక్షయ తృతీయ అమ్మకాలు..

  • రికార్డు స్థాయిలో పసిడి అమ్మకాలు..

ఈ ఏడాది అక్షయ తృతీయ కూడా బులియన్‌ వ్యాపారులకు బాగానే కలిసి వచ్చింది. దేశవ్యాప్తంగా పసిడి అమ్మకాలు రికార్డు స్థాయిలో దాదాపు రూ.20,000 కోట్లకు చేరినట్టు మార్కెట్‌ వర్గాలు చెప్పాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.4,000 కోట్లు ఎక్కువ. అమ్మకాల విలువ పెరిగినా.. అమ్మిన పసిడి పరిమాణం మాత్రం గత ఏడాదిలా 20 టన్నులు మించలేదని సమాచారం. పెరిగిన ధరలతో కొనుగోలుదారులు లైట్‌ వెయిట్‌ నగలకు పరిమితం కావడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వెండి, వెండి నగలు, బిస్కెట్లు, నాణేల అమ్మకాల విలువ కూడా ఈ సంవత్సరం రూ.4,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ఈ ఏడాది అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి అమ్మకాలు ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ బారత్‌లోనే ఎక్కువగా జరిగినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర భారత్‌లో అయితే ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం నాలుగింటి వరకు నగల దుకాణాల్లో పెద్దగా రద్దీ కనిపించలేదు. దక్షిణ భారత్‌లో మాత్రం ఉదయం నుంచే నగల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. వ్యాపారులు కూడా రకరకాల ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఆదివారం నగల దుకాణాలు రద్దీగా కనిపించాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News