Homeఆదిలాబాద్Quality Education | విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాల

Quality Education | విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాల

  • జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్యQuality Education

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి, వారి చదువు, అవగాహన స్థాయి, నేర్చుకునే సామర్థ్యాలు, వారికి కల్పిస్తున్న సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.Quality Education

విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలను మరింత పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. గ్రామంలో భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించడం, వర్షపు నీటిని సంరక్షించడం లక్ష్యంగా చేపడుతున్న వాటర్ రీఛార్జ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. వర్షపు నీటిని సమర్థవంతంగా ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇటువంటి నిర్మాణాలు ఎంతగానో ఉపయోగపడతాయని, పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు అందే ప్రయోజనాలను వివరించి, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనాలు అందేలా సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీపతి బాపు, ఎ.పి.ఓ. బాలయ్య, ఎ.పి.ఎం. సంతోష్, గ్రామ సర్పంచ్ జాడి లక్ష్మి, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News