- రెండో టెస్టులో చోటుదక్కక పోవడంతో నిరాశ..Mohammed Siraj
- తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన స్పిన్నర్ మురళీ కార్తీక్..
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టుకు పక్కన పెట్టడంపై మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. జట్టు యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, సిరాజ్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని, అతడికి అన్ని ఫార్మాట్లలోనూ తగినన్ని అవకాశాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు.Mohammed Siraj
మ్యాచ్ సందర్భంగా కెమెరాలు డగౌట్‌లో కూర్చున్న సిరాజ్‌పై దృష్టి సారించాయి. కళ్లజోడు వెనుక తన భావోద్వేగాలను దాచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించడంతో, అతను కన్నీళ్లు పెట్టుకున్నాడా? అని మురళీ కార్తీక్, అజింక్య రహానే చర్చించుకున్నారు. దీనిపై కార్తీక్ స్పందిస్తూ.. “సిరాజ్ చాలా భావోద్వేగమైన వ్యక్తి. అతడిని చూస్తుంటే బాధలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది” అని వ్యాఖ్యానించాడు.Mohammed Siraj
ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించినప్పుడు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తారని కార్తీక్ తన అనుభవాలను పంచుకున్నాడు. “కొంతమంది ఆటగాళ్లు తమను పక్కనపెట్టినా పెద్దగా పట్టించుకోరు. కానీ సిరాజ్ లాంటి వాళ్లు ఎప్పుడూ ఆడాలనే తపనతో ఉంటారు. ఒంట్లో నొప్పితో బాధపడుతున్నా, జ్వరంతో వణుకుతున్నా సరే, మైదానంలోకి దిగి తమ సర్వస్వాన్ని పణంగా పెడతారు. సిరాజ్ అలాంటి బౌలరే” అని అభిప్రాయపడ్డాడు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
