Homeనల్లగొండNiranjan Reddy Farmers | మూడేళ్లు గడిచినా రైతుల సమస్యలపై ముందస్తు చర్యలేవీ?

Niranjan Reddy Farmers | మూడేళ్లు గడిచినా రైతుల సమస్యలపై ముందస్తు చర్యలేవీ?

  • ప్రాజెక్టుల్లో నీళ్లు నింపకుండా ఇసుక దందాకు ప్రాధాన్యత.Niranjan Reddy Farmers
  • అకాల వర్షాలతో రైతుల తిప్పలు .. కల్లాల్లోనే మగ్గుతున్న ధాన్యం.
  • ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి.
  • మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.Niranjan Reddy Farmers

మూడేళ్లు గడిచినా రైతుల సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. శ్రీశైలంలో నీటి లభ్యత ఉన్న కల్వకుర్తి ఇరిగేషన్ పంపులు నడపక, ప్రాజెక్టుల్లో నీటిని నింపకుండా ఇసుక దందాకు ప్రాధాన్యత ఇస్తుందని దుయ్యబట్టారు. గురువారం వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు.Niranjan Reddy Farmers

చీరల పంపిణీపై ఉన్న శ్రద్ధ రైతులు పండించిన ధాన్యంపై ఎందుకు లేదని ప్రశ్నించారు. అకాల వర్షాలతో పంటలు తడిసి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వానికి వారి కష్టాలు కనిపించడం లేదా అని నిలదీశారు. శ్రీశైలంలో నీటి లభ్యత ఉన్నప్పటికీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు నడపకపోవడం వల్లే రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురయ్యాయని ఆరోపించారు. ఐదు పంపుల్లో రెండు పంపులు పనిచేయకపోయినా మిగిలిన మూడు పంపులను 24 గంటల పాటు నిరంతరాయంగా నడిపితే పది రోజులకు ఒక టీఎంసీ నీటిని రైతులకు అందించవచ్చని పేర్కొన్నారు. తద్వారా రైతులకు ఆరుతడి పంటల సాగుతో పాటు పశుపక్ష్యాదులు, ఇతర జీవరాశులకు నీటి ఇబ్బందులు లేకుండా చేయవచ్చని అన్నారు.Niranjan Reddy Farmers

- Advertisement -

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మూడేళ్లుగా విఫలమైన ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేయడానికే సమయం కేటాయిస్తోందని విమర్శించారు. కేసీఆర్‌ను వరుసగా తిట్టడమే ముఖ్యమంత్రి పని తప్ప ప్రజల అవసరాలను గుర్తించరా? అని సూటిగా ప్రశ్నించారు. అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం సుమారు 24 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్న నిరంజన్ రెడ్డి.. నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల కష్టాలను గుర్తించి తక్షణమే పంట నష్టపరిహారం అందించాలని, సాగునీటి విషయంలో ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ కౌన్సిలర్ నాగన్న యాదవ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News