- వుద్యోగం కోల్పోయిన సీనియర్ ఉద్యోగి..Microsoft Layoffs
- మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో బాధాకర దృశ్యం..
ఒక సంస్థలో 24 ఏళ్ల పాటు పనిచేసి, ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి, బృందాలను నిర్మించి, కొత్త ఉద్యోగులకు మార్గనిర్దేశం చేసిన వ్యక్తికి చివరికి ఒక్క ఈమెయిల్‌తో వీడ్కోలు పలకాల్సి వచ్చింది. మరీ విచిత్రమేమిటంటే.. ఏఐ టూల్స్‌తో సొంతంగా డాక్యుమెంటేషన్ రూపొందించుకోవడం ఎలాగో ఇంజినీరింగ్ బృందాలకు శిక్షణ ఇస్తున్న సమయంలోనే ఆమె ఉద్యోగం పోయినట్లు సమాచారం అందింది. మైక్రోసాఫ్ట్‌లో 24 ఏళ్ల తన కెరీర్‌కు ఇలా ముగింపు వస్తుందని ఊహించలేదంటూ లారా విలియమ్స్ చేసిన లింక్డ్ఇన్ పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికాలోని సియాటెల్ మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో లారా విలియమ్స్ 24 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈ ప్రయాణంలో ప్రిన్సిపల్ నాలెడ్జ్ ఇంజినీరింగ్ మేనేజర్ స్థాయికి ఎదిగారు.Microsoft Layoffs
అయితే సెప్టెంబర్ 22న కంపెనీ ప్రకటించిన ఉద్యోగ కోతల్లో ఆమె కూడా ప్రభావితమయ్యారు. నవంబర్ 22 ఆమెకు అధికారికంగా చివరి పని దినం. ఉద్యోగ తొలగింపు సమాచారం అందిన సమయంలో ఆమె ఇంజినీరింగ్ బృందాలకు ఏఐ టూల్స్ ఉపయోగించి సొంతంగా డాక్యుమెంటేషన్ రూపొందించుకోవడంపై 90 నిమిషాల శిక్షణ ఇస్తున్నారు. ఆ సమయంలో ‘హై ప్రియారిటీ బిజినెస్ అప్డేట్’ పేరుతో మైక్రోసాఫ్ట్ టీమ్స్ మీటింగ్ ఆహ్వానం వచ్చింది. అనంతరం లేఆఫ్ సమాచారం అందడంతో ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురయ్యారు.
తన 24 ఏళ్ల కెరీర్‌కు ఇదొక ముగింపు గుర్తుగా నిలిచిందని, ఇన్నేళ్ల ప్రయాణానికి ఇలా ముగింపు పలకడం బాధాకరమని లారా తన లింక్డ్ఇన్ పోస్టులో పేర్కొన్నారు. తనతో కలిసి పనిచేసిన డాక్యుమెంటేషన్ బృందాన్ని తన వృత్తి జీవితంలో గొప్ప విజయాల్లో ఒకటిగా అభివర్ణించారు. సహచరులు ఒకరికొకరు అండగా నిలుస్తూ అద్భుతమైన పని చేశారని, వారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉండేదని పేర్కొన్నారు. తనను సంస్థలోకి తీసుకుని, ఎదగడానికి అవకాశాలు కల్పించిన మేనేజర్లకు, నాయకత్వ లక్షణాలు నేర్పిన వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
