Homeకరీంనగర్Indiramma Illu | పేదల సొంత ఇంటి కల సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Indiramma Illu | పేదల సొంత ఇంటి కల సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

  • 207 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేసిన
  • రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగ్ రావు

జగిత్యాల: కోరుట్ల పట్టణ, మండల పరిధిలోని 207 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Illu) మంజూరు పత్రాలను తెలంగాణ రాష్ట్ర తొలి వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు పంపిణీ చేశారు. కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన 80 మంది, కోరుట్ల మండల పరిధిలోని 127 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.

- Advertisement -

ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme) ద్వారా నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరుతుందని, ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, కోరుట్ల మండల ఎంపీడీవో, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, వివిధ గ్రామాల సర్పంచులు, కోరుట్ల పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News