- నా రాజకీయ ప్రత్యర్థి కేసీఆర్ మాత్రమే..
- కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా లీడర్..
- ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై,(Revanth Reddy Targets KCR) ఆయన కుమారుడు కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను తన కథలో ‘రావణాసురుడు’గా అభివర్ణించిన రేవంత్, కేటీఆర్‌ను ‘మేనేజ్‌మెంట్ కోటా’ నాయకుడంటూ కొట్టిపారేశారు. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కేసీఆరేనని, కేటీఆర్‌ను తాను అంత సీరియస్‌గా పరిగణించడం లేదని రేవంత్ స్పష్టం చేశారు.
“కేటీఆర్ ఒక మేనేజ్‌మెంట్ కోటా నాయకుడు. తండ్రి అండతోనే ఆయన లీడర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు కేసీఆర్ కాబట్టి, ఆయన్నే నేను రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తాను” అని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేసిన రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వం తలుచుకుంటే ఆ పార్టీని ఎప్పుడో ఖతం చేసేదని, కానీ ప్రతిపక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే దాన్ని కొనసాగనిస్తున్నామని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకి ఎలాంటి ముఖ్య పాత్ర లేదని, కాంగ్రెస్‌కు బీఆర్ఎస్సే ప్రధాన శత్రువని ఆయన పేర్కొన్నారు. బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ‘ఓట్ల దొంగతనానికి’ పాల్పడుతోందని ఆరోపించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
