- విడతల వారీగా పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకునే సౌకర్యం..EPFO Systematic Withdrawal Plan
- ఎస్.డబ్ల్యు.పీ. విధానాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం..
ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తీపి కబురు అందించింది (EPFO Systematic Withdrawal Plan). పదవీ విరమణ తర్వాత పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును ఒకేసారి విత్‌డ్రా చేసుకోవాల్సిన అవసరం లేకుండా కొత్త విధానాన్ని తీసుకురావడానికి ఆమోదం తెలిపింది. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ పేరుతో ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బులను వాయిదాల పద్ధతిలో తీసుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన మొత్తంపై ఈపీఎఫ్ వడ్డీ కూడా కొనసాగుతుంది. నవంబర్ 19న కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 240వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ.పీ.ఎఫ్.ఓ. కొత్త ఎస్.డబ్ల్యు.పీ. విధానం ఎలా పనిచేస్తుంది?
ఇప్పటివరకు ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత తమ పీఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకునేవారు. ఆ డబ్బును భవిష్యత్తు అవసరాలకు ఎలా పెట్టుబడి పెట్టాలి? నెలవారీ ఖర్చులను ఎలా నిర్వహించాలి? అనే సమస్యలు ఎదురయ్యేవి. ఈ సమస్యలకు పరిష్కారంగా ఈ.పీ.ఎఫ్.ఓ. కొత్త ఎస్.డబ్ల్యు.పీ. విధానాన్ని తీసుకొస్తోంది. ఈ సదుపాయం ద్వారా రిటైర్మెంట్ తర్వాత తమ పీఎఫ్ సొమ్మును ఒకేసారి తీసుకోకుండా నెలవారీగా లేదా నిర్ణీత వ్యవధిలో విత్‌డ్రా చేసుకోవచ్చు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
