- లక్ష రూపాయల మార్క్ వైపు పయనం..Gold price fall in India
- అంతర్జాతీయ మార్కెట్ లో పరిణామాలు..
వామ్మో.. బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి(Gold price fall in India).. ఇక ఇప్పట్లో తగ్గే సీనే లేదు అనుకున్న వాళ్లందరికీ మార్కెట్ అదిరిపోయే సర్ప్రైజ్. పసిడి ధరలు ఒక్కసారిగా కిందికి దిగివస్తున్నాయి. ముఖ్యంగా 10 గ్రాముల గోల్డ్ మళ్లీ లక్ష రూపాయల మార్కు వైపు అడుగులు వేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇంతలా ధరలు తగ్గడానికి కారణమేంటి? లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయి బంగారం ధరల్లో పతనం ఆగడం లేదు. వరుస పతనంతో 10 గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల మార్కు వైపు వేగంగా దిగివస్తోంది. మనదేశంలో ఇప్పటికే ఎం సి ఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల గోల్డ్ ధర లక్ష 25వేల 570 రూపాయలకు చేరింది.
గత రాత్రి గ్లోబల్ మార్కెట్లో పసిడి ధర ఏకంగా 3.5 శాతం మేర భారీగా పడిపోయింది. ప్రస్తుతం ఒక ఔన్స్ గోల్డ్ ధర 3వేల 553 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. అమెరికన్ డాలర్ అంతకంతకూ బలపడుతుండటంతో బంగారం ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న ఈ భారీ తగ్గుదల ప్రభావం ఇవాళ మన దేశీయ బులియన్ మార్కెట్లోనూ స్పష్టంగా కనిపించనుంది. బంగారాన్ని మించి వెండిధరలు పతనం అవుతోన్నాయి.. అంతర్జాతీయంగా 41 డాలర్ల ట్రేడవుతోన్న సిల్వర్.. ఒక్కరోజే 7 శాతం పతనమైంది.. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం గోల్డ్ షాపింగ్ చేయాలనుకునే వారికి నిజంగానే ఊరటనిచ్చే వార్త!.. తులం 24క్యారెట్ల బంగారం పై ఏకంగా రూ.5వేలకు పైగా ధర తగ్గింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
