- కార్తీక మాసంలో ఎంతో ప్రత్యేకత..Amla Navami,
- శుక్లపక్ష నవమి తిథిని ఆమ్లా నవమి అంటారు..
- లక్ష్మీదేవి, పార్వతీదేవి కన్నీటి చుక్కలే ఉసిరికగా మారాయట..
కార్తీక మాసంలో ప్రతి రోజుకూ ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా ఈ మాసంలోని శుక్ల పక్ష నవమి తిథిని (Amla Navami) ‘ఆమ్లా నవమి’ లేదా ‘అక్షయ నవమి’గా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయకు ఎంతటి ప్రాధాన్యత ఉందో.. కార్తీక మాసంలో వచ్చే అక్షయ నవమికి కూడా అంతే విశిష్టత ఉందని పురాణాలు, హిందూ సంప్రదాయాలు చెబుతున్నాయి. ఈ రోజున చేసే పూజలు, జపాలు, దానధర్మాల ఫలితం ఎప్పటికీ క్షీణించకుండా అక్షయంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ పర్వదినాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. మరి ఈ రోజున ఉసిరి చెట్టును ఎందుకు పూజిస్తారు? దాని వెనుక ఉన్న పురాణ గాథలు ఏమిటో తెలుసుకుందాం.
ఉసిరిచెట్టు ఆవిర్భావం గురించి బృహద్ధర్మ పురాణంలో ఒక ఆసక్తికరమైన గాథ ప్రస్తావించబడింది. ఒకసారి దేవతలు, మహర్షులంతా ప్రభాస తీర్థంలో సమావేశమయ్యారు. ఆ సమయంలో పార్వతీదేవి, లక్ష్మీదేవి పరస్పరం తమ భర్తలైన పరమేశ్వరుడు, శ్రీమహావిష్ణువులను కొత్త విధంగా పూజించాలని సంకల్పించుకున్నారు. ఈ ఆలోచనతో వారి మనసులు భక్తి పారవశ్యంతో నిండిపోయాయి. ఆ ఆనందంలో వారి కళ్ల నుంచి జాలువారిన కన్నీటి బిందువులు భూమిపై పడ్డాయి. ఆ పవిత్రమైన కన్నీటి బిందువుల నుంచే నాలుగు అందమైన ఉసిరి చెట్లు మొలిచాయని పురాణ గాథ చెబుతోంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
