Homeఆరోగ్యంCustard Apple | సీతాఫలం చేసే మేలు అన్నీ ఇన్నీ కావు..

Custard Apple | సీతాఫలం చేసే మేలు అన్నీ ఇన్నీ కావు..

  • విటమిన్లు, ఖనిజాలు, పీచు, యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి..Custard Apple
  • రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం సీతాఫలం..Custard Apple

మాధుర్యానికి పోషక విలువలు తోడయితే.. అది సీతాఫలం (Custard Apple). విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండు రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీనిని ‘ప్రకృతి ప్రసాదించిన వరం’ అని పిలుస్తారు. ఈ పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి, మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. సీతాఫలంలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. విటమిన్-ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఎముకలు, దంతాలకు దృఢత్వాన్ని చేకూరుస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థల పనితీరును మెరుగుపరచడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలోనూ ఇది తోడ్పడుతుంది. రక్తహీనత నివారణకు, శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇందులోని సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి, ఆహారాన్ని శక్తిగా మార్చే జీవక్రియలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ సీతాఫలం తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇందులో సహజ చక్కెరలు, కేలరీలు అధికంగా ఉంటాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని పరిమితంగా మాత్రమే తినాలి. లేదంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. అలాగే ఈ పండును అతిగా తింటే కడుపుబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. అలర్జీ ఉన్నవారికి దురద, దద్దుర్లు రావచ్చు. ముఖ్యంగా సీతాఫలం విత్తనాల్లో కంటికి హాని చేసే విషపూరిత సమ్మేళనాలు ఉంటాయి కాబట్టి విత్తనాలను తినకూడదు. ఈ పండును అలాగే నేరుగా తినవచ్చు లేదా హల్వా, కస్టర్డ్, మిల్క్‌షేక్, ఐస్‌క్రీమ్‌లా తయారు చేసుకుని ఆస్వాదించవచ్చు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News