ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (medical camp) పరిధిలోని ఏకన్నగూడెం గ్రామంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. క్షయ నిర్ధారణ పరీక్షలు మరియు ఎక్స్రే, స్క్రీనింగ్, తెమడ సేకరణ పరీక్షలను వైద్య సిబ్బంది జరిపారు. గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీలత సమక్షంలో వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో 22 మందికి క్షయ పరీక్షలతో పాటు స్క్రీనింగ్ నిర్వహించారు. మొత్తం 32 మందికి ఈ శిబిరంలో వివిధ పరీక్షలను జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీలత, హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
