Homeనిజామాబాద్‌Rahul Gandhi | చికాగోలో రాహుల్ గాంధీతో తాడ్వాయి యువకుడి ఆత్మీయ భేటీ!

Rahul Gandhi | చికాగోలో రాహుల్ గాంధీతో తాడ్వాయి యువకుడి ఆత్మీయ భేటీ!

  • ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాలతో కార్యక్రమంలో పాల్గొన్న జూకంటి సుధీర్ రెడ్డిRahul Gandhi
  • అగ్రనేతతో కరచాలనం చేసి తనను తాను పరిచయం చేసుకున్న యువకుడు..!

అమెరికాలోని చికాగో నగరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత (Rahul Gandhi) రాహుల్ గాంధీని తాడ్వాయి మండలం దేవయపల్లి గ్రామానికి చెందిన యువకుడు జూకంటి సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు జూకంటి వెంకటరెడ్డి కుమారుడైన సుధీర్ రెడ్డి, చికాగోలో జరిగిన ఈవెంట్‌కు హాజరై రాహుల్ గాంధీతో కరచాలనం చేశారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్ మోహన్ రావు ఆదేశాలు, ప్రోత్సాహంతో తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి తనను తాను పరిచయం చేసుకుంటూ, తాడ్వాయి మండలంలో పార్టీ బలోపేతానికి తమ కుటుంబం చేస్తున్న కృషిని, స్థానిక పరిస్థితులను క్లుప్తంగా వివరించారు. జాతీయ స్థాయి అగ్రనేతను నేరుగా కలుసుకోవడం తన జీవితంలో మరపురాని అనుభూతి అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -
Tadwai Youth Meets Rahul Gandhi 768x1024 1

iఈ అరుదైన అవకాశాన్ని కల్పించి, ప్రోత్సహించిన గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు జూకంటి సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు, తమ మండలానికి చెందిన యువకుడు అమెరికా గడ్డపై రాహుల్ గాంధీని కలవడంపై తాడ్వాయి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News