Homeనల్లగొండPACS | మఠంపల్లి మండలానికి రెండు నూతన పీఏసీఎస్‌లు మంజూరు

PACS | మఠంపల్లి మండలానికి రెండు నూతన పీఏసీఎస్‌లు మంజూరు

గ్రామీణ రైతులకు సహకార సేవలను (PACS) మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రవ్యాప్తంగా 240 నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఏర్పాటుకు బుధవారం అధికారికంగా మెమో జారీ చేసింది. ఇందులో భాగంగా మఠంపల్లి మండల పరిధిలోని యాతవాకిళ్ల, రఘునాథపాలెం గ్రామాలకు నూతన పీఏసీఎస్‌ల ఏర్పాటుకు అనుమతి లభించింది.నూతన సంఘాల ఏర్పాటుతో ఆయా గ్రామాల రైతులకు సభ్యత్వాలు కల్పించడంతో పాటు పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు వంటి వ్యవసాయ సేవలు స్థానికంగానే సులభంగా అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటివరకు ఈ సేవల కోసం మఠంపల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది.ప్రస్తుతం సొంత గ్రామాల్లోనే సంఘాలు మంజూరు కావడంతో రైతులకు వ్యయప్రయాసలు తప్పనున్నాయి.ప్రభుత్వ నిర్ణయంపై ఇరు గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఉన్నతాధికారులు స్పందించి సంఘాల ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి రానున్న ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News