- నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్.ఎల్.సి.ఐ.ఎల్.NLCIL Recruitment 2026
- డిసెంబర్ 19 వరకు దరఖాస్తులకు అవకాశం..
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అడ్వర్టయిజ్మెంట్ నం. 11/2026 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిలో భాగంగా వివిధ విభాగాల్లో 145 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులను నింపనుంది. ఈ పోస్టులు నైవేలి (తమిళనాడు), బర్సింగ్సార్ (రాజస్థాన్), తలాబిరా (ఒడిశా), సౌత్ పచ్వారా (జార్ఖండ్), ఇతర సోలార్, విండ్ ప్రాజెక్టులు, అనుబంధ సంస్థల్లో ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 20 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 19తో ముగుస్తుంది. అర్హత, ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలి.NLCIL Recruitment 2026
అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఫుల్ టైమ్ లేదా పార్ట్ టైమ్ బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), ఎల్.ఎల్.బీ., పీజీ డిగ్రీ/డిప్లొమా చదివి ఉండాలి. పని అనుభవం డిప్యూటీ జనరల్ మేనేజర్ (మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్)కు 19, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (అన్ని విభాగాలు)కు 5, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ (సైంటిఫిక్)కు 4, డిప్యూటీ మేనేజర్ (హెచ్ ఆర్, లీగల్)కు 1 ఏండ్లు ఉండాలి. అడిషనల్ చీఫ్ మేనేజర్ (సెక్యూరిటీ)కు సీనియర్ లెవల్ సెక్యూరిటీ/డిఫెన్స్, పోలీస్ అనుభవం, అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ)కు ఆర్మ్డ్ ఫోర్సెస్/CAPF లేదా సెక్యూరిటీ అనుభవం ఉండాలి.
వయసు : డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు 57, అడిషనల్ చీఫ్ మేనేజర్‌కు 47, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు 41, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లకు 35, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్‌కు 30 ఏండ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5, ఓబీసీలకు 3 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులు 1:6 నిష్పత్తి కంటే ఎక్కువగా వస్తే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. లీగల్ విభాగం పోస్టులకు ప్రొఫెసనల్ నాలెడ్జ్‌పై సీబీటీ నిర్వహిస్తారు. పరీక్ష 80 శాతం మార్కులు, ఇంటర్వ్యూ 20 మార్కులకు ఉంటుంది.
జీతం : ఎంపికైనవారికి నెలకు జీతం డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఈ – 7 గ్రేడ్)కు రూ. 1,00,000 – 2,60,00, అడిషనల్ చీఫ్ మేనేజర్ (ఈ -6 గ్రేడ్)కు రూ. 90,000 – 2,40,00, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈ -4 గ్రేడ్)కు రూ. 70,000 – 2,00,000, డిప్యూటీ మేనేజర్ (ఈ -3 గ్రేడ్)కు రూ. 60,000 – 1,80,000, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ (సైంటిఫిక్) (ఈ -2 గ్రేడ్)కు రూ. 50,000 – 1,60,00, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ (సెక్యూరిటీ) (ఈ -1 గ్రేడ్)కు రూ. 40,000 – 1,40,00 ఇస్తారు.
ఫీజు : దరఖాస్తు ఫీజు రూ. 854, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్సర్వీస్మెన్లకు రూ. 354 ఉంది.NLCIL Recruitment 2026
చివరితేదీ : ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 20 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 19తో ముగుస్తుంది. ఇతర వివరాలకు వెబ్సైట్ www.nlcindia.in చూడండి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
