- సైబర్ ట్రాక్ ఉత్పత్తికి దొరికిన సమయం..Tesla Cybertruck
- పెండింగ్ ఆర్డర్లు పూర్తిచేసే ప్రక్రియ..Tesla Cybertruck
టెస్లా సైబర్‌ట్రక్ (Tesla Cybertruck ) ఉత్పత్తికి మరికొంత సమయం దక్కింది. వచ్చే ఏడాది మధ్యలోనే ఈ పికప్ ట్రక్ తయారీని నిలిపివేయనున్నట్లు గతంలో ప్రకటించిన ఎలాన్ మస్క్.. తాజాగా ఆ గడువును వేసవి చివరి వరకు పొడిగించారు. పెండింగ్‌లో ఉన్న ఆర్డర్లను పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో టెక్సాస్‌లోని గిగాఫ్యాక్టరీలో సైబర్‌ట్రక్ తయారీ మరో రెండు, మూడు నెలలు కొనసాగనుంది.
సైబర్‌ట్రక్ ఉత్పత్తిని తగ్గించి, ఆ సామర్థ్యాన్ని రోబోట్యాక్సీ అయిన సైబర్‌క్యాబ్ తయారీకి వినియోగించాలని టెస్లా గతంలో నిర్ణయించింది. అయితే సైబర్‌ట్రక్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారుల ఆర్డర్లు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో ఉత్పత్తిని కొంతకాలం కొనసాగించాలని మస్క్ భావించారు. గతంలో నిర్ణయించిన గడువులోగా వాహనాలను తయారు చేయలేకపోతే కొందరు కొనుగోలుదారులకు డిపాజిట్లు తిరిగి ఇవ్వాల్సి రావచ్చని కూడా ఆయన సూచించారు. ఉత్పత్తి పొడిగింపు లాభాల పరంగా తెలివైన నిర్ణయం కాకపోవచ్చని మస్క్ ఎక్స్‌లో పేర్కొన్నారు. సైబర్‌ట్రక్ ఏడాదికి 2.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి సాధిస్తుందని గతంలో మస్క్ అంచనా వేశారు. అయితే 2023 చివర్లో డెలివరీలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం అమ్మకాలు సుమారు 70 వేల యూనిట్లేనని పరిశ్రమ అంచనాలు చెబుతున్నాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
