- సి.ఎస్.కె. సన్ రైజర్స్ మధ్య ఆటగాళ్ల మార్పులు..CSK SRH player trade 2027
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ట్రేడింగ్ విండోలో ఒక భారీ ఒప్పందం కుదిరింది (CSK SRH player trade 2027). చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీల మధ్య పలువురు కీలక ఆటగాళ్లు చేతులు మారారు. ఈ మెగా ట్రేడ్‌లో భాగంగా, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ చెన్నై జట్టులోకి రాగా, భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్, ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి చేరారు. ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం లివింగ్‌స్టోన్ బదిలీ. గతంలో ఎస్ఆర్హెచ్ అతడిని రూ.13 కోట్లకు కొనుగోలు చేయగా, ఇప్పుడు చెన్నై సగాని కన్నా తక్కువ ధరకు, అంటే కేవలం రూ.6 కోట్లకు సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2026 సీజన్లో లివింగ్‌స్టోన్ కేవలం రెండు మ్యాచ్‌లే ఆడి 15 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక, గాయం కారణంగా గత సీజన్‌కు దూరమైన జాక్ ఎడ్వర్డ్స్‌ను సీఎస్కే అతని ప్రస్తుత ఫీజు రూ.3 కోట్లతో జట్టులోకి తీసుకుంది. ఈ ఇద్దరు ఓవర్సీస్ ఆల్‌రౌండర్ల చేరికతో చెన్నై జట్టు సమతూకం పెంచుకుంది. మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ పేస్ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకుంది. గతంలో 2018 నుంచి 2021 వరకు ఎస్ఆర్హెచ్కే ప్రాతినిధ్యం వహించిన ఖలీల్ అహ్మద్, తన ప్రస్తుత ఫీజు రూ.4.8 కోట్లతో తిరిగి సొంత జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్ 2025లో సీఎస్కే తరఫున 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసిన ఖలీల్, 2026లో గాయం కారణంగా ఐదు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరున్న నాథన్ ఎల్లిస్ రూ.2 కోట్ల ఫీజుతో హైదరాబాద్ జట్టులోకి చేరాడు. అతను కూడా గత సీజన్లో గాయం కారణంగా ఆడలేదు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
