Homeనల్లగొండKrishna Thanda | వానొస్తే... నరకమే

Krishna Thanda | వానొస్తే… నరకమే

  • రేకుల ఇంట్లో కంటిమీద కునుకు కరువే…
  • తడిసిపోతున్న ఇంట్లో సామానులు…
  • అర్హత ఉన్న దక్కని ఇందిరమ్మ ఇళ్లు…
  • కలెక్టర్ స్పందించాలని బాధిత కుటుంబం వేడుకోలు…

మఠంపల్లి: తుఫాన్ల ప్రభావంతో ఇటీవల కురుస్తున్న వర్షాలు ఓ నిరుపేద కుటుంబానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిలువ నీడనిచ్చే ఇల్లే వర్షపు నీటితో నిండిపోవడంతో ఎక్కడ ఉండాలో తెలియని దయనీయ పరిస్థితిలో ఆ కుటుంబం కాలం వెళ్లదీస్తోంది. కనీసం రాత్రివేళ ప్రశాంతంగా నిద్రించేందుకు కూడా అవకాశం లేక ఇబ్బందులు పడుతోంది.పూర్తి వివరాల్లోకి వెళితే…సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలోని కృష్ణాతండ(Krishna Thanda) గ్రామపంచాయతీ పరిధిలోని భూక్య లింగయ్య కుటుంబం నివసిస్తున్న రేకుల ఇల్లు పాతపడిపోవటంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. ఇంటి పైకప్పు రేకుల నుంచి వర్షపు నీరు కారుతూ ఇల్లంతా తడిసిపోతోంది. ఇంట్లోకి నీరు చేరడంతో బట్టలు, బియ్యం, నిత్యావసర వస్తువులు తడిసిపోతున్నాయి.

మంచాలు వేసుకునేందుకు,భోజనం చేసేందుకు కూడా సరైన వసతి లేక అవస్థలు పడుతున్నారు.తమ దీనస్థితిని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇందిరమ్మ ఇల్లు పథకానికి అర్హులమైనప్పటికీ తమకు ఇల్లు ఎందుకు మంజూరు చేయడం లేదని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది.జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో ఇంటి పరిస్థితిని పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదకరంగా మారిన ఇంట్లో నివసిస్తున్న కుటుంబానికి తక్షణ సహాయం అందించడంతో పాటు అర్హతను పరిశీలించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఏ క్షణంలోనైనా ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News