- పలు కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్న అధికారులు
జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆర్టీఓ (RTO) ఏజెంట్ల కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) (ACB Raid) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆకస్మికంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పలు ఏజెంట్ల కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో పలు కీలక ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించిన లావాదేవీలు, వాహన రిజిస్ట్రేషన్లు, ఇతర రికార్డులకు సంబంధించిన పత్రాలను పరిశీలించినట్లు తెలుస్తోంది.
స్వాధీనం చేసుకున్న ఫైళ్లు, పత్రాల ఆధారంగా అధికారులు తదుపరి విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ దాడులతో కోరుట్ల పట్టణంలోని ఆర్టీఓ ఏజెంట్లలో ఒక్కసారిగా కలకలం రేగింది.
అయితే ఏసీబీ తనిఖీలకు(ACB Raid) సంబంధించిన పూర్తి వివరాలు, స్వాధీనం చేసుకున్న పత్రాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
