- మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో దౌర్భాగ్యం
- అబద్దాలకోరుగా మారిన కమీషనర్..!
- బోడుప్పల్ సర్కిల్ నెం.10లో అనుమతులు లేని అక్రమ షెడ్..
- ఈ నిర్మాణాన్ని కూల్చివేసామని ట్విట్టర్లో అధికారికంగా ప్రచారం.
- అక్రమ షెడ్‌ని కూల్చేసిన 10 రోజులు కూడా కాలేదు..
- తిరిగి నిర్మాణానికి సహకరించిన మున్సిపల్ అధికారులు..
- అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి, సక్రమం చేసినందుకు ఎవరి వాటాలు ఎంత..?
- ప్రశ్నిస్తున్న బోడుప్పల్ సర్కిల్ ప్రజలు..
మేడిపల్లి: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో నిత్యం వందలకొద్ధి అనుమతులు లేని అక్రమ నిర్మా ణాలు పుట్టగొడుగుల్లాగా వెలుస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను సహించేది లేదంటూ ఈ మధ్యనే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి చెప్పు కొచ్చారు. కమిషనర్ అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తు న్నామంటూ ప్రకటనలు ఇస్తున్నారు.. అలాగే తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా కూల్చివేసిన ఫోటోలను,(Fake Demolition) వీడియోలను అప్లోడ్ చేసి ప్రభుత్వం దృష్టిలో శభాష్ అనిపించు కుంటున్నారు.

కానీ ఇదంతా ఒకెత్తయితే, ఏదైతే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి(Fake Demolition) ట్విట్టర్లో పెట్టుకుంటున్నాడో అదే అక్రమ నిర్మాణం 10 రోజులు గడవక ముందే అక్రమం సక్రమమై ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. మరి ఆమాత్రానికి కూల్చడం ఎందుకు..? కూల్చామని గొప్పగా ట్విట్టర్లో పెట్టుకోవడం ఎందుకు..? ఎవరిని మోసం చేయడానికి ఈ అబద్ధాలు..? మోసపూరిత ప్రకట నలు..? అని బోడుప్పల్ ప్రజలు బాటంగానే విమర్శిస్తున్నారు.

బోడుప్పల్ సర్కిల్ నెం.10. బాలాజీ హిల్స్‌లో గత నెలలో సుమారు 1000 చదరపు గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా భారీ కమర్షియల్ షెడ్డు నిర్మించారు. ఈ అక్రమ షెడ్డు నిర్మాణ విషయంలో బోడుప్పల్ సర్కిల్‌కు చెందిన బోడుప్పల్ సెటిలర్స్ అసోసియేషన్ వారు ఫిర్యాదు చేసారు. ఇదే కాకుండా పలు దినపత్రికలలో, అదేవిధంగా సోషల్ మీడి యాలో అక్రమ నిర్మాణం గురించి వివిధ కథనాలు వచ్చాయి. దీనికి సంబంధించి మున్సి పల్ కమిషనర్ ఆదేశాల మేరకు బోడుప్పల్ సర్కిల్ అధికారులు పాక్షికంగా కూల్చివేశా

ఇట్టి అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేసిన వీడియోలు ఫోటోలు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన అధికా రిక ట్విట్టర్లో పోస్ట్ చేసారు. ఎక్కడ నిర్మాణాలు జరిగినా నిర్దాక్షణంగా కూల్చి వేస్తామంటూ ఈ ట్విట్టర్ వేదికగా అక్రమ నిర్మాణదారులను హెచ్చరించారు.. కానీ ఇదంతా ఒక బూటకం అని, కేవలం పది రోజులకే వీరి బండారం బయటపడి పోయింది.. కూల్చివేసిన భారీ అక్రమ షెడ్డు మళ్లీ నిర్మించి ప్రారంభోత్స వానికి సిద్ధం చేశారు అక్రమ నిర్మాణ దారులు.
ఇదంతా కూడా మున్సిపల్ అధికారుల చేతి వాటంతోనే జరిగిందంటూ పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు.. ఇప్పటికైనా అధికారులు అనుమతు లేని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించకుండా, అధికారులు అక్రమ నిర్మాణాలపై చట్టరీత్యా చర్యలు తీసుకొని మునిసిపల్‌కు రావలసిన ఆదా యాన్ని కాపాడగలరని, అలాగే ఫేక్ ఫోటోలను, వీడియోలను గొప్పగా చిత్రీకరించు కుంటూ అధి కారిక ట్విట్టర్లో అప్లోడ్ చేయ కుండా.. అబద్ధాల కమిషనర్ అని ప్రజల ముందు అభాసుపాలు కాక ముందే జాగ్రత్త పడి, మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని స్థానికులు కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
